సత్యం, అహింసతోనే గాంధీజీ స్వాతంత్ర్యం తెచ్చారు: ఉప రాష్ట్రపతి

భారత జాతిపిత, ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహా నాయకుడు గాంధీజీ. ఆ మహా నాయకుడి 72వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా యావత్‌భారతావని ఆయనకు నివాళులు అర్పిస్తోంది. సత్యం, అహింసా అనే రెండు సిద్ధాంతాలతోనే ఆయన దేశానికి స్వాతత్య్రం సాధించిపెట్టారని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఆయనకు నేను మనస్పూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు. అహింసా మార్గంలో కూడా యుద్ధం చేయొచ్చని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. శాంతి మార్గంలో స్వాతంత్య్రం సాధించిపెట్టిన ఆ నాయకుడి జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. భారత ప్రజలు ఆయనను నిత్యం స్మరించుకుంటారని ఆయన తెలిపారు.