క్యూ51 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన ఎల్‌జీ

ఎల్‌జీ కంపెనీ క్యూ51 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్‌ మెయిన్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 2 మెగాపిక్సల్‌ డెప్త్‌ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 13 మెగాపిక్సల్‌ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫోన్‌ వెనుక భాగంలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఏర్పాటు చేశారు. రూ.18,820 ధరకు ఈ ఫోన్‌ త్వరలో వినియోగదారులకు లభ్యం కానుంది.