ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర తెలిపారు. యూరప్ నుంచి శ్రీలంకకు వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో తనవంతు బాధ్యతగా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు సంగక్కర తెలిపాడు.
'నాకు కరోనా లక్షణాలేవీ లేవు. కానీ నేను ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నాను. వారం రోజుల క్రితమే నేను లండన్ నుంచి వచ్చాను. మార్చి 1-15 మధ్య విదేశాల నుంచి వచ్చిన వారంతా తప్పకుండా పోలీస్ స్టేషన్‌లో తమ వివరాలు నమోదు చేయించుకోవాలని ఆ తర్వాత సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలన్న విషయాన్ని వార్తల్లో చూశాను. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుసరిస్తూ పోలీసుల వద్ద పేరు నమోదు చేసుకొని నిర్బందంలో ఉన్నానని' సంగక్కర పేర్కొన్నాడు.