మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితిపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మహమ్మారిలా విస్తరిస్తున్న కరోనాను కంట్రోల్ చెయ్యడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిత్యావసర సరుకులు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వర నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యను అరికట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు.


అప్రమత్తంగా ఉండక పోతే అనర్దాలు చవిచూడాల్సి ఉంటుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున ప్రజలు విధిగా సహకరించాలి. చట్టం ఉల్లంఘన అనేది ఏ ఒక్కరికి మినహాయింపు కాదు. నిబంధనలు ఉల్లంఘన జరిగితే పరిస్థితులు చెయ్యి దాటి పోయే ప్రమాదం ఉంది. స్వీయనియంత్రణ తోటే వైరస్ ను అరికట్టొచ్చు. ఏ నిర్ణయం తీసుకున్న ప్రజల ఆరోగ్యభద్రత కొరకే అన్నది గుర్తించుకోవాలి. కనబడని వైరస్ సృష్టించిన అల్లకల్లోలం ప్రజలకు తెలియంది కాదు. తమంతట తామే లాక్‌డౌన్‌ విజయవంతం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.